మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జాతీయ యువజన అవార్డు గ్రహీత నెహ్రూ యువ కేంద్రం ప్రతినిధి బిసాతి భరత్ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం శ్రీసాయి కృప జూనియర్ కాలేజ్లో యువతకు మాదకద్రవ్యాల నివారణ, మత్తు పదార్థాల దుర్వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, నెహ్రూ యువ కేంద్ర అనంతపురం విజన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.