ధర్మవరం పట్టణంలోని సాయినగర్ లోని సూర్య హై స్కూలులో శుక్రవారం వరలక్ష్మి వ్రతం పూజ హెడ్ మాస్టర్ వై. నరేంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. పవిత్రమైన శ్రావణమాసంలో శుక్రవారం వరలక్ష్మి పూజ జరుపుకోవడం అందరికి చాలా శ్రేష్టమైనదని నరేంద్ర బాబు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.