ధర్మవరం మండలం బిల్వంపల్లి గ్రామానికి చెందిన కళమ్మ అనే వివాహిత అనారోగ్య కారణాలతో శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి కలమ్మ ను హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.