అనంతపురం జిల్లాలో వింత ఘటన..
బత్తలపల్లి మండలంలోని అప్పరాచెరువు గ్రామంలో ఊరి బయట ఓ వేప చెట్టుకు కల్లు కారుతుంది. ఈ విషయం గమనించిన గ్రామస్తులు శనివారంపెద్ద ఎత్తున వేప చెట్టుకు పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ప్రకారం వేప చెట్టుకు కల్లు కారుతుందని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ రకమైన సంఘటన మా గ్రామంలో ముందుగా జరగలేదు అని మహిళా భక్తులు చెప్పారు.