గుత్తిలో యాచకురాలిపై కుక్క దాడి

82చూసినవారు
గుత్తి ఆర్ఎస్ లోని ఆంజనేయుడి స్వామి ఆలయం వద్ద కూర్చొని ఉన్న యాచకురాలిపై ఓ కుక్క దాడి చేసింది. దాడిలో యాచకురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ లో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల కాలంలో కుక్కల బెడద అధికమైందని మున్సిపల్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్