గుత్తి మున్సిపాలిటీలో అర్హులైన బలిజ కులస్తులు కాపు కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ కింద అర్హులైన బలిజ కులస్తులు సబ్సిడీ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. రేపటితో దరఖాస్తుకు గడువు ముగుస్తుందని పేర్కొన్నారు.