సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో నూతనంగా విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ డి ఎస్ పి శ్రీనివాసులు ఆదివారం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. నూతన సంవత్సర వేడుకలలో జాగ్రత్తలు వహించాలని ప్రజలకు తెలియజేయాలన్నారు.