కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం తెచ్చి గొప్ప సంఘ సంస్కకర్త జ్యోతిరావుపూలే అని హిందూపురం వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి టిఎ న్. దీపిక అన్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని గురువారం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి ఎంతో కృషి చేశారన్నారు.