కదిరి: కబ్జాలు భూదందాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం: ఎమ్మెల్యే
కదిరి నియోజకవర్గంలో రాజకీయ ముసుగులో కబ్జాలు భూదందాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపుతామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హెచ్చరించారు. బుధవారం కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 5ఏళ్ళ జగన్ పాలనలో వ్యవస్థలను కొల్లగొట్టారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి వుందని తెలిపారు.