కళ్యాణదుర్గం: జగన్ ఫ్లెక్సీని చించిన గుర్తుతెలియని వ్యక్తులు

74చూసినవారు
కళ్యాణదుర్గం: జగన్ ఫ్లెక్సీని చించిన గుర్తుతెలియని వ్యక్తులు
కుందుర్పి మండలం ఎర్రగుంట గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలను సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఫ్లెక్సీల చించివేత ఘటన వివాదాస్పదంగా మారింది. ఈనెల 21న మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైసీపీ శ్రేణులు గ్రామంలో పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా దుండగులు ఫ్లెక్సీలు చించారు. అధికార పార్టీ కార్యకర్తలే ఫ్లెక్సీలను చించివేశారని వైసీసీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్