ధర్మవరం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ కి అవగాహన సదస్సును నిర్వహించారు. శనివారం స్థానిక ఎన్జీవోహంలో నిర్వహించిన ఈ సమావేశానికి సత్యసాయి జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ అధ్యక్షురాలు శ్రీదేవి, కార్మిక సంఘం నాయకులు పెద్దన్న జై వి రమణ తదితరులు హాజరయ్యారు. అనంతరం అంగన్వాడి కార్మికులకు సంబంధించి పలు సమస్యలను ఎలా అధిగమించాలో కార్మికులకు నాయకులు వివరించారు.