పత్తి పంటను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

55చూసినవారు
పత్తి పంటను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి
మడకశిర మండలం జిల్లేడు గుంట గ్రామంలో శుక్రవారం ప్రకృతి సేద్యంలో సాగు చేసిన పత్తి పంటను జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి సిద్ధంగా పంట సాగు చేయడంతో మిత్ర పురుగులు అభివృద్ధి చెంది పురుగు మందుల ఖర్చు తగ్గించుకోవచ్చు అని తెలిపారు. భూసారం కోసం ఘన ద్రవ జీవామృతము వాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్