త్రాగునీటి సమస్య తీరుస్తా: ఎమ్మెల్యే రాజు

81చూసినవారు
మడకశిర పట్టణంలోని యాదవ కాలనీవాసులు తాగునీటి సమస్య ఉందని శుక్రవారం మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు దగ్గర వాపోడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి తానే మంగళవారం స్వయంగా వచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. గతంలో కూడ నియోజకవర్గంలోని పలు గ్రామాలు, కాలనీల్లో తాగునీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయనే స్వయంగా వెళ్లి సమస్య పరిష్కరించి ప్రజలకు తాగునీటిని అందించారు.

సంబంధిత పోస్ట్