మడకశిర ఎమ్మెల్యే ఎం ఎస్ రాజు బుధవారం ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో పట్టణంలోని ఆర్ఎంబీ వసతి గృహంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ప్రతి పథకాన్ని గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.