మడకశిర మండల కేంద్రంలోని రేకులకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అంజినప్ప కుమార్తె ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సోమవారం ఆ గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.