గూగూడు ఉత్సవాలను పురస్కరించుకొని ధర్మవరం నుండి గూగూడుకు ఈనెల 14వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నుండి గూగూడు కు వయా బత్తలపల్లి, నార్పల మీదుగా గూగూడు వెళుతుందని, పెద్దలకు 70 రూపాయలు పిల్లలకు 40 రూపాయల టికెట్ ధర అని తెలియజేశారు.