శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని చాకలికుంట సమీపంలో బీసీ కాలనీ లో ప్రభుత్వానికి సంబంధించిన కొంత పొలంలో రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారని ఆ కాలనీవాసులు తెలిపారు. బుధవారం శ్రీ ఆంజనేయస్వామి విగ్రహానికి చూడటానికి చుట్టుపక్కల కాలనీవాసులు భక్తులు వచ్చి పూజలు చేశారు.