గోరంట్ల మండల పరిధిలో ఉన్న కొత్త బోయినపల్లి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో వాలంటర్ ను హత్య చేసిన నిందితులను మంగళవారం మధ్యాహ్నం పెనుగొండ డిఎస్పి బాబీ జాన్ సైదా మీడియా ముందు ఉంచారు. మద్యం మత్తులో మల్లాపల్లి గ్రామానికి చెందిన వాలంటర్ అనిల్ కుమార్ యాదవ్ ను కొత్తచెరువు గ్రామానికి చెందిన 5మంది యువకులు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని వారిని అదుపులోకి తీసుకొని నేడు కోర్టుకు హాజరుపరుస్తున్నామని డిఎస్పీ తెలిపారు.