బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం విజయవాడలోని సచివాలయంలో బీసీలకు రిజర్వేషన్ల తీర్మానంపై చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రి మండలి సమావేశంలో తీర్మానం చేశారన్నారు.