పెనుకొండ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈడిగ నరేంద్రబాబు గౌడ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. పెనుకొండ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు అందించారు. ఈడిగ నరేంద్రబాబు గౌడ్ మాట్లాడుతూ. పెనుకొండ నియోజవర్గ వికలాంగుల తరపున స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు తనను ప్రోత్సహించి గెలిపించాలని అభ్యర్థించారు.