ఉపాధి హామీ బిల్లులు సకాలంలో చెల్లించండి

77చూసినవారు
ఉపాధి హామీ బిల్లులు సకాలంలో చెల్లించండి
గోరంట్ల మండల పరిధిలోని పులగుర్లపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు పెద్దన్న సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీలు మాట్లాడుతూ వారం రోజులు పనిచేస్తున్న రోజుకు కేవలం 200 రూపాయలు మాత్రమే కూలి వస్తుందని అది కూడా పది రోజులైనా సకాలంలో పేస్లిప్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉపాధి కూలీలకు మజ్జిగ, త్రాగునీరు ఏర్పాట్లను పట్టించుకునే వారే కరువయ్యారని తమ గోడును కార్మిక సంఘం నాయకులకు విన్నవించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్