గ్రామీణ పేదల సమస్యలపై సత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 28న జరిగే ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం గోరంట్ల మాధవరాయ గుడి వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నార్సింపల్లి ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణలత, భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ కొండా వెంకటేష్ మాట్లాడుతూ గ్రామీణ పేదల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.