హైదరాబాద్ లో 7% పెరిగిన రియల్ ఎస్టేట్.. ప్రముఖ సంస్థ వెల్లడి
హైదరాబాద్ లో 7% రియల్ ఎస్టేట్ పెరిగినట్లు ప్రముఖ సంస్థ స్క్వేర్ యార్డ్స్ (SquareYards) తమ నివేదికలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే, HYDలో జులై- సెప్టెంబర్ మధ్య 7% ఇండ్ల రిజిస్ట్రేషన్లు పెరిగినట్లు తెలిపింది. 3 నెలల్లో రూ. 11,718 కోట్ల విలువైన ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని.. ఇది గత ఏడాదితో పోలిస్తే 20% అధికమని పేర్కొంది. గత ఏడాది JULY-SEPT మధ్య 18,314 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరుగగా.. ఈ ఏడాది JULY-SEPT మధ్య 19,527 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది.