ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుంది: మంత్రి

67చూసినవారు
ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుంది: మంత్రి
విజయవాడ వరద సహాయ కార్యక్రమాలలో భాగంగా 56 వ డివిజన్ పాత రాజారాజేశ్వరి పేటలోని కొత్త మసీదు రోడ్డులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత మంగళవారం పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న నిత్యావసరాల పంపిణీని మంత్రి పరిశీలించారు. అదేవిధంగా ఫైర్ ఇంజన్లతో ప్రభుత్వమే ఇళ్లని, షాపులను శుభ్రం చేస్తుందని బాధితులకు మంత్రి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్