పెనుకొండ నియోజకవర్గంలోని ఐదు మండల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఎన్టీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నియోజకవర్గం రూ. 23.31 కోట్లతో 41.50 కిలో మీటర్ల మేర నూతన రోడ్లు నిర్మించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ త్వరలోనే రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.