శ్రీసత్యసాయి జిల్లా పరిగి చెరువు నిండి మరవ పారుతున్న సందర్బంగా సోమవారం సంప్రదాయబద్దంగా వస్తున్న ఆచారం ప్రకారం గుమ్మగట్ట వాస్తవ్యులచే పరిగి చెరువు మరువకు గంగపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిగి మండలం అధికారులు, నాయకులు, ప్రజలు గంగపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగమ్మ పసుపు, కుంకుమ, చీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.