మంత్రి సవిత రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధిదారులు, మహిళలు గంజాయికి బానిస అయ్యారని మంత్రి సవిత అనడం ధుర్మాగం అన్నారు. ప్రజల ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు. లబ్ధిదారులను ఉద్దేశించి ఏవిధంగా మాట్లాడాలో తెలియని మంత్రి సవిత మంత్రి వర్గంలో వుండటం దౌర్భాగ్యం అన్నారు.