శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పట్టణ టిడిపి కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్చార్జిలతో మంత్రి సవితమ్మ సూచన మేరకు సభ్యత్వ నమోదు పై సమావేశం జరిగింది. ఈసమావేశంలో టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి వార్డులో 500 టిడిపి సభ్యత్వాలు మినిమం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.