సోమందేపల్లి: వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

62చూసినవారు
సోమందేపల్లి: వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఏఎస్ఐ మురళి పేర్కొన్నారు. సోమవారం సోమందేపల్లి మండల కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా క్రీస్తుజ్యోతి పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఎస్ఐ మాట్లాడుతూ అతి వేగంగా వాహనాలు నడపరాదని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని తెలిపారు. కార్యక్రమంలో జమేదార్ సుధాకర్, కానిస్టేబుల్ నరేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్