తల్లి పాల వారోత్సవాలులో భాగంగా గురువారం పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ నవీన, డాక్టర్ స్వరూప రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలలో తల్లి పాల ప్రాముఖ్యత పట్ల గర్భవతులకు బిడ్డ తల్లులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దిరెడ్డిపల్లి, గొరవనహల్లి గ్రామాలలో హాజరైన వైద్యులు, సిబ్బంది తల్లి పాల విశిష్టతను వివరించారు.