పెనుకొండ పట్టణంలో మండల రెవెన్యూ కార్యాలయం నందు పెనుకొండ ఎంఆర్ఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ ని తెదేపా నాయకులు మర్యాపూర్వకంగా కలిశారు. వారు పలు రెవెన్యూ సమస్యలను, ఇంటి పట్టాలు సమస్యలను యంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లగా త్వరితగతిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తెదేపా పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, టిడిపి నాయకులు వెంకటరాముడు, అశ్వర్థ నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.