తుపాకీతో వీరంగం సృష్టించిన టీడీపీ నేత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుడు గంగాధర్ కు మంగళవారం స్థానికులు దేహశుద్ధి చేశారు. రామగిరి మండలం కుంటిమద్దిలో లైంగికంగా వేధించాడంటూ బాధిత మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ తుపాకీ, కత్తితో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో గంగాధర్ కు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు.