బుక్కరాయసముద్రం: ఆటో డ్రైవర్ పై దాడిలో హిజ్రల వివరణ

52చూసినవారు
బుక్కరాయసముద్రం: ఆటో డ్రైవర్ పై దాడిలో హిజ్రల వివరణ
అనంతపురం సమీపంలోని బుక్కరాయసముద్రం మండల కేంద్రం చెరువు కట్ట వద్ద ఇటీవల ఓ ఆటో డ్రైవర్పై హిజ్రాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హిజ్రాలు వివరణ ఇచ్చారు. తమ ఆత్మ రక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ వల్ల ఎవరికీ హాని జరగదని అన్నారు. బీ. సముద్రం పోలీసులు మాట్లాడుతూ హిజ్రాలు ఇబ్బందులు కలిగిస్తే తమకు తెలపాలన్నారు. తప్పు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్