తాడిపత్రిలో కారును ఢీకొన్న లారీ

81చూసినవారు
తాడిపత్రిలో కారును ఢీకొన్న లారీ
తాడిపత్రి మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు మండల పరిధిలోని ఇగూడూరు గ్రామం వద్ద తాడిపత్రి - గుత్తి ప్రధాన రహదారిపై ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని వెనక నుంచి వస్తున్న లారీ కంటైనర్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్