ఉరవకొండ: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

55చూసినవారు
ఉరవకొండ: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
గ్రంథాలయాలు ఆధునిక సమాచార కేంద్రాలని వాటిని వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలవాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు టీ. గోపాల్, లైబ్రరీయన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆదివారం గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రూప్ 2, గ్రూప్ 1, ఇలా కాంపిటిటివ్ పరీక్షలకు, గ్రంథాలయంలోని పుస్తకాలు నిరుద్యోగులకు ఉపయోగపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్