ఉరవకొండ పట్టణంలో విద్యార్థులకు డేట్ అఫ్ బర్త్, పేర్లు సవరణ కోసం అధికారుల దగ్గరికి వెళితే ఒక్కొక్క విద్యార్థి నుండి రూ.2000 పైగా వసూలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థ ఆరోపించారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపార్ కార్డు చేయించుకోవాలంటే విద్యార్థులకు డేట్ బర్త్, పేర్లు సవరణ చేసుకోవడం కోసం అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.