ఉరవకొండ గ్రంథాలయాల ఏర్పాటుకు ఉద్యమకారులు అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమ రావుల కృషి చిరస్మరణీయమని స్థానిక లైబ్రేరియన్ ప్రతాప్ రెడ్డి శనివారం అన్నారు. గ్రంథాలయంలో ఉద్యమకారుల ఫోటోలకు నివాళులు అర్పించారు. వారి సేవలను కొనియాడారు. పాఠకులు, విద్యార్థులు, గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు.