ఎన్టీఆర్ బావమరిదిగా తెలుగు పరిశ్రమకు పరిచయై వరుస విజయాలను అందుకుంటున్నాడు హీరో నార్నే నితిన్. ఇటీవల మ్యాడ్ 2తో మంచి విజయం సాధించాడు. తాజాగా శ్రీశ్రీశ్రీ రాజావారు అనే మూవీతో మరోసారి అలరించనున్నారు. ఈ మూవీకి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. సంపద హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. జూన్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.