ఆమదాలవలస ప్రశాంతి నగరం వాస్తవ్యులు రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ డాక్టర్ గొల్ల మల్లేశ్వరరావు అన్న క్యాంటీన్ కు రూ. 20,000 చెక్కును విరాళంగా స్థానిక శాసనసభ సభ్యులు కూన రవికుమార్ ద్వారా అందించారు. అన్న క్యాంటీన్ ప్రతిరోజు ఆకలితో ఉన్నవారికి ఐదు రూపాయలకే ఆకలిని తీరుస్తుందని, ఇటువంటి కార్యక్రమాల్లో నేను సైతం విరాళం ఇవ్వకూడదు అనే భావంతో గొల్ల మల్లేశ్వరరావు విరాళాన్ని అందజేశారు.