ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉపాధ్యాయ ఉద్యమ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆముదాలవలస పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జిల్లా ఉపాధ్యక్షులు పి. అప్పలనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ బి. చంద్రశేఖర్, సీనియర్ నాయకులు హెచ్. వి. సత్యనారాయణ, బి. వి. యస్. యన్. మూర్తి, పి. సూర్యనారాయణ ఉన్నారు.