ఆముదాలవలస పరిధిలోని ఓ మహిళను హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆముదాలవలస మండలంలోని గాజుల కొల్లివలస, ఆర్ అర్ కాలనీకి చెందిన దామోదర పద్మ అనే మహిళ భర్త రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఆమె సొండి సురేశ్ అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో సురేశ్ పద్మను కత్తితో పొడిచి ఈ నెల 15న హత్య చేశాడని వివరించారు.