ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి వూసావానిపేటలో కొలువైఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయములో హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శనివారం సుమారు 50 మంది దంపతులు స్వామివారికి తమలపాకుల పూజని, అర్చన నిర్వహించారు. ఆలయ అర్చకులు మావుడూరి సత్యనారాయణ శర్మ, సూర్య ప్రకాష్ శర్మ, శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి తీర్థ ప్రసాదాలను ఇచ్చి ఆశీర్వదించారు.