ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి రైతు బజారు వద్ద గురువారం సబ్సిడీపై కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభోత్సవం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్ లో రూ. 200 పలుకుతుండగా. రైతు బజార్లో కిలో రూ. 160 రూపాయలకు అందిస్తారని అన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.