ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస గ్రామంలో.. శుక్రవారం ప్రధానమంత్రి జన్ మన్ గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలను అధికారులతో చర్చించి అక్కడికక్కడే పరిష్కరించారు.