2024 ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసోచ్చిన సీఎం జగన్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. బొంతుపేట గ్రామంలో బుధవారం సాయంత్రం వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గ్రామంలో ఇంటింటికి వెళ్లి. ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ చేసిన మంచిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్, ముఖ్య నేతలు పాల్గొన్నారు.