లావేరు నూతన తహసీల్దార్‌గా ఇటీవల నియమితులైన జిఈఎల్ శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కలక్టరేట్‌లో సూపరింటెండ్‌గా పనిచేస్తూ ఇక్కడి తహశీల్దార్‌గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ డీటీ శ్రీనివాస్, ఆధ్వర్యంలో ఆర్ఐ, వీఆర్వోలు, సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ రాజశేఖర్ విజయనగరం జిల్లా రాజాంకు బదిలీపై వెళ్లారు.