బూర్జపాడులో వైసిపి అభ్యర్థి విజయ పల్లెనిద్ర

80చూసినవారు
బూర్జపాడులో వైసిపి అభ్యర్థి విజయ పల్లెనిద్ర
ఇచ్చాపురం మండలంలోని బూర్జపాడు గ్రామంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ శుక్రవారం రాత్రి పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక రచ్చబండ వద్ద గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం వైఎస్ జగన్, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో వైసిపికి మద్దతు పలకాలని కోరారు.

ట్యాగ్స్ :