ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం పోలాకి మండలం ప్రియాగ్రహారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్న పాఠ్యపుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. రానున్న కాలంలో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా కొనసాగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.