గర్భిణీలకు పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు

70చూసినవారు
నరసన్నపేట మండలం మాకివలస పీహెచ్సీలో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారిణి శిరీష తెలిపారు. మంగళవారం స్థానిక ఆరోగ్య కేంద్రంలో 15 మంది గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆరుగురుకి హైరిస్క్ జోన్‌లో ఉన్నట్లుగా గుర్తించామన్నారు. వారికి ప్రత్యేకంగా వైద్య సహాయం అందిస్తామన్నారు. అనంతరం నరసన్నపేట మారుతి నగర్‌కు చెందిన సత్య సేవా సమితి వారు గర్భిణులకు ఉచితంగా భోజన సదుపాయం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్