నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు.